Subscribe Us

header ads

ఆదర్శ ఉత్తమ ఉపాధ్యాయునకు ఘన సన్మానం.


  శ్రీకాకుళం:-

గురుపూజోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న పాతపట్నం ఆదర్శ పాఠశాల వృక్షశాస్త్ర ఉపాధ్యాయుడు అప్పలరాజు బల్లెడ కు పాఠశాలలో ప్రిన్సిపాల్ కె.వి రత్నకుమారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు తులగాపు ప్రసాద్ రావు సన్మాన పత్రాన్ని రచిస్తే దాన్ని మురళి మాస్టారు విద్యార్ధుల కు చదివి వినిపించారు. ప్రిన్సిపల్ రత్నకుమారి మాట్లాడుతూ అప్పలరాజు మాస్టారు సేవలు అనిర్వచనీయం అని త్వరలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని అప్పలరాజు మాస్టారు సేవలను కొనియాడి సత్కరించారు.