Subscribe Us

header ads

ఏపీలో కూటమి పాలనతో గ్రామీణా అభివృద్ధి నేడు చిగురులు తొడుగుతోంది.


మండల టీడీపీ అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి 

మంజీర గళం ప్రతినిధి :రెడ్డీగూడెం ;

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలంలోని గ్రామ పంచాయతీలో శుక్రవారం నాడు జరిగిన గ్రామ సభలో రెడ్డిగూడెం మండల టిడిపి అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు చీకట్లో మగ్గిన గ్రామాలు నేడు వెలుగులతో నిండబోతున్నాయి.జగన్ రెడ్డి పాలనలో పంచాయతీల్లో బ్లీచింగ్ చల్లే పరిస్థితులు లేని దశ నుండి గ్రామాలు నూతన హంగులు సంతరించుకునే పరిస్థితి చంద్రబాబు పాలనలో వచ్చింది.జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో పంచాయితీలకు చెందాల్సిన రూ.13వేల కోట్లు తన సొంత ఖాతాకు మళ్లించుకుని గ్రామాలకు ద్రోహం చేశాడు.2014-19 మధ్య కాలంలో చంద్రబాబు గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లను నిర్మించారు.జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నరకప్రాయమైన గుంతల రాజ్యాన్ని పరిచయం చేశాడు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే గ్రామీణాభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం నుండి వచ్చిన రూ.990కోట్లు మరియు జల్ జీవన్ మిషన్ పథకం కింద రాష్ట్ర వాటాగా రూ.500కోట్లు మొత్తం రూ.1,490కోట్లను గ్రామ పంచాయతీల ఖాతాలకు జమ చేశారు.రానున్న కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 17,500కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించేందుకు చంద్రబాబు నేతృత్వంలో ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి.గ్రామాల్లో మురుగు నీటి సమస్య పరిష్కారం కోసం ఏకంగా 10వేల కిలోమీటర్ల డ్రైనేజీల నిర్మాణానికి చంద్రబాబు మార్గాన్ని సుగమం చేశారు.2014-19 మధ్య కాలంలో చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాలు నిర్మిస్తే.. జగన్మోహన్ రెడ్డి వాటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చాడు.ఇలాంటి చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాలను చంద్రబాబు మరోసారి రాష్ట్ర ప్రజలకు అక్టోబర్ నెల నుండి అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.
2014-19 మధ్య కాలంలో చంద్రబాబు గ్రామీణ ప్రాంతాల్లో 25 లక్షల వీధి దీపాలను ఏర్పాటు చేస్తే, జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఈ వీధి దీపాలను కూడా సరిగా నిర్వహించలేకపోయాడు.పాలనలో 60శాతం మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వీధి దీపాలన నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది.ఐదేళ్లపాటు చీకట్లో మగ్గిపోయిన గ్రామాల్లో నేడు వెలుగులు నింపేందుకు అవసరమైన వీధి దీపాల పునరుద్ధరణకు చంద్రబాబు అవసరమైన చర్యలు చేపట్టారు.గ్రామాల్లో ప్రజలకు అవసరమైన త్రాగునీరు, మరుగుదొడ్లు, వంట గ్యాస్, విద్యుత్ వంటి సౌకర్యాలు అవసరమైన మేరకు అందించేందుకు అధికారులు తగిన ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గ్రామీణ ప్రాంతాల మధ్య నుండి ప్రధాన రహదారులకు అనుసంధానం చేసే అప్రోచ్ రోడ్లను కూడా త్వరితగతిన నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితి లేక పంచాయతీ సర్పంచులే ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించే పరిస్థితులు వచ్చాయి.
గ్రామంలో అత్యవసర పరిస్థితుల్లో కనీసం బ్లీచింగ్ చల్లే పరిస్థితి కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గ్రామాలను భ్రష్టు పట్టించాడు. కరోనా కష్టసమయంలో కూడా గ్రామాల్లో బ్లీచింగ్ చల్లే పరిస్థితి లేదు.
గ్రామీణ స్వరాజ్యాన్ని తెచ్చానని బీరాలు పలికే జగన్మోహన్ రెడ్డి గ్రామ పంచాయతీల ఖాతాల నుండి దోచుకున్న నిధులపై గ్రామీణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది.
జగన్మోహన్ రెడ్డి గ్రామ పంచాయతీలపై చూపిన వివక్షను తట్టుకోలేక వైసీపీ నుండి గెలిచిన సర్పంచులే ఆ పదవులకు దూరంగా ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి.
పంచాయతీల్లో రోడ్లు ఊడ్చేందుకు చీపుర్లు కూడా లేక సర్పంచులు అప్పులు చేసి పంచాయతీలను నిర్వహించే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. అనేక మంది సర్పంచులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ ల కూటమి ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపుగా వడివడిగా అడుగులు వేయడం గ్రామ సభల ద్వారా ప్రారంభం కానుంది.
గ్రామ పౌరులు తమ గ్రామానికి ఏమేమి కావాలో చర్చించి, ఆ పనులు చేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ వేదిక గ్రామ సభ.
ప్రతి పౌరుడు గ్రామ సభకు హాజరై, గ్రామీణాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ముప్పిడి నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ మల్లాది రాణి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.