హైదరాబాద్ఇ టీవల ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీం కోర్ట్ ఇచ్చిన సంచలన తీర్పు విధితమే.. వివరాల్లోకి వెళితే..... తెలంగాణ రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎస్సీ వర్గీకరణ పై అభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కమిటీ అందరి(మాదిగ,మాదిగఉపకులాల) అభిప్రాయాలను తీసుకోబోతుంది.తెలంగాణలో ఉన్న ప్రతిమాదిగ మరియు ఉప కులాలు అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఉన్నది.ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మాదిగ జాతి అభివృద్ధి కోసం సూచనలు, సలహాలిస్తారని కమిటీ సభ్యులైనటువంటి సి. రామచందర్,ప్రొఫెసర్.జి. మల్లేశం, ఎం.విజయ్ మరియు ఇన్ఫోర్మ్ అధినేత గెడ్డం బాపిరాజు మంజీరగళం పత్రికకు తెలియజేశారు.