న్యూడిల్లి :ఏలూరుజిల్లా ఎంపీ పుట్టా మహేష్ కు ఢిల్లీ లో అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళితే.... న్యూడిల్లీ లోని ఎన్ డి ఎమ్ సి కన్వెన్షన్ సెంటర్ లో నూతనంగా ఎన్నికైన యాదవ బిసి సామాజిక వర్గ ఎంపీలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సమాజ్ వాదీ పార్టీ అధినేత మరియు యూపీ మాజీ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్, ఇతర పెద్దలతో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. అఖిల భారత వర్షియ యాదవ మహాసభ మరియు కె జి ఎఫ్ ఇండియా ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన ఈ సత్కార కార్యక్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఎన్నికైన యాదవ, బీసీ ఎంపీలుహాజరైనారు.
ఆంధ్రప్రదేశ్ నుండి పార్లమెంటుకు ఎన్నికైన ఏలూరు పుట్టా మహేష్ కుమార్ ను అఖిల భారత వర్షియ యాదవ మహాసభ మరియు కె జి ఎఫ్ ఇండియా ఆర్గనైజేషన్ వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహచర ఎంపీలు బి.నాగరాజు, బీద మస్తాన్ రావు కూడా పాల్గొన్నారు.