Subscribe Us

header ads

ప్రతిభా అవార్డు గ్రహీతకు ఘనంగా సత్కరించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి


 
బావి భారత అభివృద్ధి ప్రతిభా వంతులైన యువత వలనే సాధ్యం

 రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి

నూజివీడు :సీనియర్ ఇంటర్లో 991 మార్కులు సాధించిన నూజివీడు పట్టణ శారద జూనియర్ కళాశాల విద్యార్థి దేదీప్యసాయిని సన్మానించి చిన్నారిని ఆశీర్వదించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి, మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు వేలకోట్ల వెచ్చించి నూతన విద్యా విధానం చేపట్టిందని తద్వారా విద్యలో నైపుణ్యం పెరిగి ప్రతీ ఒక్కరూ విద్యలో ప్రతిభ కనుబరుస్తున్నారన్నారు.

 విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు కార్యదీక్షతో ఆయనకున్న ప్రతిభ అనుభవంతో విద్యలో అనేక మార్పులు తెచ్చారని అన్నారు, విద్యా విధానంలో నూతన మార్పులు చేపట్టడం ద్వారా విద్యలో నాణ్యత పెరిగి ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు, కూటమి ప్రభుత్వం పై నమ్మకంతో బహుళ జాతి సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టాయని రిలియన్స్,టాటా, మిట్టర్, మహేంద్ర వంటి సంస్థలు మన రాష్ట్రానికి తరలి వస్తున్నాయని తద్వారా యువతకు సుమారు 4.50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు.

త్వరలో 17 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు నియమిస్తున్నామన్నారు, రానున్న 5 సంవత్సరాల కాలంలో సుమారు 20 లక్షల ఉద్యోగాలు నియమిస్తున్నామని మంత్రి అన్నారు, బావి భారత భవిషత్ అభివృద్ధి అంతా యువతదే అన్నారు, గొప్ప విజన్, కార్యదీక్ష, అపార అనుభవం కలిగిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వలనే ఇవన్నీ సాధ్యం అన్నారు ఆయన నాయకత్వంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు,ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.