కామవరపుకోట, (మంజీరగళం )ప్రతినిధి :
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి పంచాయతీలో శుక్రవారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 13,326 పంచాయతీలో ఓకేరోజున మొదలైన గ్రామ సభలు రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగాప్రజాలు పాల్గొని ఉపాధి పనులకు ఆమోదం.రూ.4,500 కోట్ల విలువైన పనులకు ప్రజలే తీర్మానాలు.శుక్రవారం ఉదయం నుంచీ రాష్టంలోని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం కనిపించిందన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వారి ఆధ్వర్యంలో, గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో,ఆర్ డబ్ల్యూ,ఎస్ ఈ, ఎల్ వి వి సత్యనారాయణ, హౌసింగ్ ఏ ఈ రాధాకృష్ణ,పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు గారు, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.