Subscribe Us

header ads

హిందూపురం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాను స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ



బడుగులకు, అల్ప సంఖ్య వర్గాలకు తెలుగుదేశం ప్రభుత్వం అగ్ర తాంబూలం ఇస్తూనే ఉన్నది

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్

హిందూపురం పట్టణంలో 237 ఇంటి పట్టాలకు పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయడం జరిగింది.

జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్

హిందూపురం :హిందూపూర్ నియోజకవర్గంలో సోమవారం నాడు స్థానిక శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తో కలిసి పలు అభివృద్ధి కార్య్రకమాల్లో పాల్గొన్న రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రెవిన్యూ శాఖ, ఆధ్వర్యంలో హిందూపురంలోని మున్సిపాలిటీ పరిధిలో కొట్టునూరు గ్రామం కొల్లకుంట కాలనీలో 237 ఇంటి పట్టాలకు పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

 ముఖ్య అతిథిగా, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్య ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, శ్రీమతి వసుంధర, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ, జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ..

బడుగు, బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ టీడీపీ...అటువంటి టీడీపీకి బడుగు, బలహీన వర్గాల నియోజకవర్గమైన హిందూపురం ఎల్లప్పుడూ అండగా ఉందన్న మంత్రి 

నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో వెయ్యి కోట్ల రూపాయాల విలువైన ఇళ్ల స్థలాల స్వాధీన పత్రాలను 3 వేల మందికి పంపిణీ చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం మాది. సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం. వచ్చే నెల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నాం. 

అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ అశీస్సులు మెండుగా ఉన్నాయి. 

అమరావతితోపాటు రాజధాని కలుపుతూ జరిగే అన్ని రహదారుల నిర్మాణం అన్ని త్వరగా జరగాలని ప్రధాని మోదీ కోరుతున్నారు. 

 ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గ ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. 

 237 ఇంటి పట్టాల కు Possession సర్టిఫికెట్ పంపిణి చేయడం జరిగిందిప్రభుత్వం మంజూరు చేసిన పట్టాల కు సర్వ హక్కులు కల్పించాలనే ఉద్దేశ్యం తో హిందుపుర్ పట్టణo kotnuru గ్రామం కొల్లకుంట కాలని లో position ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారుఈ సర్టిఫికెట్ తో మీరు బ్యాంకు ల ద్వారా లోన్ తీసుకొని జీవనోపాధి కోసం మగ్గాలు ఏర్పాటు చేసుకోవడం లేదా వేరే స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన సంవత్సరం లోపే NREGS నిధులు సుమారు 50 కోట్ల రూపాయల తో ప్రతి గ్రామానికి తారు రోడ్డు. సౌకర్యం, CC రహదారులు, డ్రైనేజీ లు ఏర్పాటు చేసాము.మున్సిపాలిటి లో 38 వార్డులలో CC రహదారులు, డ్రైనేజ్ లు ఏర్పాటు చేయడానికి CM గారి తో మాట్లాడి 92.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం. జరిగింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.

 హిందూపురం పట్టణం లో తాగునీటి సమస్య శాశ్వత. పరిస్కారం కోసం అంతర్గత పైప్ లైన్ నిర్మాణం కోసం 136 కోట్ల తో ప్రతిపాదనలు పంపించాం, ఈ నిధులు కూడాత్వరలో మంజూరు 53 పనులు ప్రారంభం చేస్తామని తెలిపారు సభా ముఖంగా తెలియచేస్తున్నాము.

వినాయక నిమజ్జనం చేసి గుడ్డం కోనేరు మరమ్మాతులకు AHUDA నుండి 1 కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందిHandlooms and Textiles మరియు జిల్లా Skill Development వారి అద్వర్యం లో మహిళ లకు ఉపాది కల్పించాలని, వారికి స్వయం ఉపాధి కలిగించడానికి. వారు ఆర్థికంగా ముందడుగు వేయడానికి ప్రభుత్వం 60 మంది మహిళలకు ఉచితంగా 60 రోజులు శిక్షణ ఇచ్చి, విలువైన కుట్టు మెషిన్ లను పంపిణీ చేస్తుంది.

ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం చాలా. కార్యక్రమాలు అమలు. చేస్తుంది, మహిళా సంఘాలకు విరివిగా loans మంజూరు చేస్తూ ఆర్థికంగా, సామజికంగా ఎదగడానికి

BC welfare వారి ఆధ్వర్యంలో హిందూపురం నియోజకవర్గం లో సుమారు 2000 మందికి టైలరింగ్ లో 3 నెలలు శిక్షణ ఇచ్చి కుట్టు మెషిన్ లను అందించడం జరుగుతుంది.

నియోజకవర్గం మొత్తం 20 కేంద్రాలు గుర్తించము, ఇప్పటికే 5 కేంద్రాలలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలిపారు . అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు 237 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేయుచున్నాము.

తర్వాత ఈ పత్రాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, పొదుపు, మెప్మా మహిళా సంఘాలు రుణం కొరకు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు. అలాంటి పద్ధతుల్లోని రుణం కొరకు ఆన్లైన్ నందు నమోదు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో టేకులోడు, తుమ్ము కుంట ప్రాంతాలలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఇక్కడే ఉపాధి దొరుకుతుందని తెలిపారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అంతకు మునుపు 9 మందికి పట్టాలు పంపిణీ చేశారు, రాధమ్మ, లక్ష్మీదేవి, పద్మ, వనజ మంజుల, జయమ్మ, దేవరాజులు, ఇతరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్ కుమార్,

మున్సిపల్ చైర్మన్D E రమేశ్ గారు పి డి హౌసింగ్ మరియు స్పెషల్ ఆఫీసర్, హిందూపూర్ శ్రీ వెంకటనారాయణ మున్సిపల్ కమిషనర్ శ్రీ సంఘం శ్రీనివాసులు గారు

 వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్శ్రీ మల్లికార్జున్ గౌడ్ గార. స్థానిక మొదటి వార్డ్ TDP పార్టీ చంద్ర శేఖర్ సత్యసాయి జిల్లా TDP పార్టీ అధ్యక్షులు శ్రీ V అంజినప్ప గారు. జిల్లా TDP పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ శివశంకర్ గారు, న్యాయవాది

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి K పరిమళ గారుఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్శ్రీ ఎమ్ ఆనంద్ కుమార్ గారు పాల్గొన్నారు.