అవనిగడ్డ :
అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు పర్యవేక్షణలో సెప్టెంబర్ ఒకటిన విజయవాడలో జరిగే మెగా పవర్ ఫీస్ట్ వేడుకలకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ను ఆహ్వానించారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అభినందన సభ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆదివారం సాయంత్రం విజయవాడలో ఏర్పాటు చేశారు. అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సోడిశెట్టి కృష్ణప్రసాద్, లకనం శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇల్లూరి సుగుణబాబు మంగళవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే స్వగృహానికి వచ్చి ఈ వేడుకలకు విచ్చేయవలసినదిగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ లను ఆహ్వానించారు.
ఈ సందర్బంగా వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విజయవాడ చిరంజీవి యువత అధ్యక్షులు కే.రాకేష్ నాధ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బాదర్ల లోలాక్ష నాయుడు, జిల్లా మాజీ అధ్యక్షులు పద్యాల వెంకట ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు భోగాది శివ విష్ణువర్ధన్, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, సీనియర్ నాయకులు గాజుల శంకర్రావు, చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షులు సిద్దినేని అశోక్ నాయుడు, అప్పికట్ల తారక మస్తాన్ పాల్గొన్నారు.