ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అనగా 27-08-2024 నాడు తెలుగు శాఖ ఆధ్వర్యంలో అతిదోపన్యాసం నిర్వహించబడింది. ముఖ్యఅతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ రమేష్ కార్తీక్ నాయక్ విచ్చేసి, విద్యార్థులకు సృజనాత్మక రచనలైన కవిత రచన, కథానిక రచన చేయటంలో మెలకువలను, రచన విధానాల గురించి వివరించారు. ప్రతి విద్యార్థి తాము ప్రతిరోజు చూస్తున్న విషయాలను తీసుకొని చక్కటి రచనలు చేయవచ్చని హితబోధ చేశారు. సాహిత్య రచనకు సృజనాత్మక శక్తి కావాలని, అది ప్రతి ఒక్కరిలో దాగుంటుందని, దాన్ని బయటికి తీసి చక్కటి రచనలు చేయాలని తెలియజేశారు..
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు అధ్యక్షతగా వ్యవహరించారు. తెలుగు భాష ఎంత గొప్పదో వివరిస్తూ, తెలుగు భాషలో సృజనాత్మకత పెంచుకుంటే ముఖ్య అతిధుల లాగా, విద్యార్థులు కూడా గొప్ప వ్యక్తులుగా ఎదగవచ్చు అని హితబోధ చేశారు. అదేవిధంగా కళాశాల సీనియర్ అద్యాపకులు ఎం.మధు, యు.వెంకటాచార్యులు, ఎం. శ్రీనివాసరావు, టి.ఝాన్సీ రాణి, వెంకటలక్ష్మి విజయ దీపిక మొదలైన వారు పాల్గొని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మన కళాశాలకు వచ్చి విద్యార్థులకు ఉపదేశం ఇవ్వడం హర్షించదగ్గ విషయమని, ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ జి వెంకట లాల్ ను అభినందించారు. ఈ కార్యక్రమం అనంతరం శ్రీ రమేష్ కార్తీక్ నాయక్ ను ‘సాహిత్య పారిజాతం అవార్డు’తో సన్మానించారు. ఈ కార్యక్రమం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.