Subscribe Us

header ads

100 రోజుల ప్రణాళిక సాధన నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలి- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

(మంజీరగళం)ప్రతినిది.ఏలూరు

ఎలూరు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు 100 రోజుల ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాల సాధన పూర్తి చేసేందుకు కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో 100 రోజుల ప్రణాళిక లక్ష్య సాధనపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లాలోని వ్యవసాయం, అనుబంధ శాఖలు, పరిశ్రమలు, విద్యా, వైద్యం, రోడ్లు, భవనాలు, ఐసిడిఎస్, పౌర సరఫరాలు, తదితర శాఖల పరిధిలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వారికి నిర్దేశించిన లక్ష్యాలలో 100 రోజులలో పూర్తిచేయవలసిన లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని, ఆయా పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలనీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నూరు రోజుల ప్రణాళిక అమలులో ఏలూరు జిల్లాను రాష్ట్ర స్థాయిలో ముందుస్థానంలో నిలిపేలా అధికారులు పనిచేయాలన్నారు. లక్ష్యాల సాధనపై ఆయా శాఖలు రూపొందించిన నివేదికలను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలను కలెక్టర్ జారీ చేశారు. 

  సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, డీఆర్డీఏ పీడీ విజయరాజు, అటవీశాఖాధికారులు రవిశంకర్, హిమశైలజ,డ్వామా పీడీ పి . రాము, డిఎంహెచ్ఓ డా.శర్మిష్ఠ, డీఈఓ అబ్రహం, జిల్లా వ్యవసాయశాఖాధికారి హబీబ్ భాషా, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఆదిశేషు, ఎంఐపి పీడీ రవికుమార్, ఉద్యానవనాలు శాఖాధికారి రామ్మోహన్, ఐసిడిఎస్ పద్మావతి, గృహనిర్మాణ శాఖాధికారి శ్రీనివాస్, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, ప్రభృతులు పాల్గొన్నారు.