ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో చెప్పినట్లు అన్ని రకాల పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు సాధిస్తానన్నారు. మాట తప్పేది లేదు. ఏ పని పట్టుకున్నా, అయేవరకు వదిలిపెట్టనన్నారు. రైతులను గుండెల్లో పెట్టుకుంటానని. నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశాను. రైతులకు గిట్టుబాటు ధర, యువతకు ఉపాధి, పోలవరం నిర్మాణం వేగవంతం, పోలవరం నిర్వసితులకు న్యాయానికి చేయాలనీ అడిగానన్నారు. త్వరలో జరగనున్న కేంద్ర కేబినెట్ మీటింగ్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12 వేల కోట్ల రూపాయల మంజూరు ఛేస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో యువతకు ఉపాధి, రైతులకు గిట్టుబాటు ధర, పోలవరం, రైల్వే ప్రాజెక్టుల గురించి, మాట్లాడాను. ఏలూరు కు వందేభారత్ నిలుపుదల గురించి అడిగాను. సెప్టెంబర్ నెలలో ఏలూరు లో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.ఈ సమావేశంలో మాజీ శాసన సభ్యులు ఘంటా మురళీ, పొగాకు రైతు నాయకులు సత్రం వెంకట్రావు, కాకర్ల శేషుబాబు మరియు జిల్లా నలుమూలల నుండి వందలాదిగా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.