నూజివీడు :ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గంలో గల నూజివీడు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల శ్రీ గౌతమి స్కూల్ పై వస్తున్న తప్పుడు ఆరోపణలు, ఎవరు నమ్మవద్దని, గిట్టని వారు కక్షపూరితంగా మా మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని, స్కూల్ యాజమాన్యం శనివారం నాడు మంజీరగళం దినపత్రికకు ప్రకటన ఇవ్వడం జరిగింది.
దీనిలో భాగంగా స్కూల్ కరస్పాండెంట్ ఈ.శోభనాద్రి మాట్లాడుతూ... నూజివీడు పరిసర ప్రాంత ప్రజలకు మరియు పేరెంట్స్, స్కూల్ యాజమాన్యంలకు ముందుగా నమస్కారములు తెలియజేస్తూ.. శ్రీ గౌతమి హై స్కూల్ ని ఎవరో కార్పొరేట్ విద్యా వ్యవస్థలకి స్కూలు అమ్మేశామని దుష్ప్రచారం చేస్తున్నారని,ఇలా ప్రచారం చేస్తున్న కొన్ని స్కూల్స్ యాజమాన్యం వాళ్ళ స్కూలు యొక్క ప్రత్యేకతలు తెలియజేసి, క్యాంపైనింగ్ చేసుకుంటే మంచిదని, అంతేగాని వేరే స్కూల్ వాళ్లకి అమ్మేశారని ,తప్పుడు మాటలు మాట్లాడే యాజమాన్యాలకు వాళ్ళ విజ్ఞతకే మేము వదిలేస్తున్నామని తెలిపారు.
స్కూల్ నడిపించే సామర్థ్యం మా దగ్గర ఉందని, స్కూల్ అమ్మిసేంత దుష్ట పరిస్థితి మాకు ఇంకా రాలేదని, ఇలా దుష్ప్రచారం చేస్తున్న స్కూల్ యాజమాన్యములు మరియు టీచర్స్ కి వాళ్ళ విజ్ఞతకే మేము వదిలేస్తున్నామని కరస్పాండెంట్ శోభనాద్రి హెచ్చరించారు.కావున
శ్రీ గౌతమి హై స్కూల్, కరస్పాండెంట్ అయిన ఇలపర్తి. శోభనాద్రి ఆధ్వర్యంలోనే స్కూల్ నడపబడుతుందని, కావున నూజివీడు పరిసర ప్రాంత ప్రజలకు, పేరెంట్స్ మరియు టీచర్స్ అండ్ స్కూల్ యాజమాన్యం లకు తెలియజేయడమైనదని, అడ్మిషన్ కొరకు నేరుగా స్కూలును సంప్రదించవచ్చని కరస్పాండెంట్ శోభనాద్రి తెలిపారు.