నూజివీడు /ఆగిరిపల్లి :ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సింగన్నగూడెం గ్రామంలోని వేంచేసిన ఉన్న శ్రీ శ్రీ కృష్ణదుర్గాదేవి అమ్మవారిని రాష్ట్ర గృహనిర్మాణ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులుకొలుసు పార్థసారధి దర్శించుకున్నారు.తొలుత వేదపండితులు అర్చకులు పీఠాధిపతివారు మేల తాళలతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి దిశాలువాతో ఘనంగా సత్కరించినారు.
మంత్రివర్యులు మాట్లాడుతూ....శ్రీ కృష్ణ దుర్గా అమ్మవారి కరుణా కటాక్షంతో రాష్ట్ర నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్ర రైతాంగం అంతా పాడి పంటలతో వర్ధిల్లాలని అన్నారు.అమ్మవారు ఎంతో మహిమ గల దైవం అని కోరిన కోర్కెలు వెంటనే సిద్ధించునని తెలిపారు.అమ్మవారి కరుణా కటాక్షంతో ఆగిరపల్లి గొల్లగూడెం గ్రామలోని రైతులు,పశు సంపద అంతా దిన దిన అభివృద్ధి చెంది ప్రజలంతా ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు.
అమ్మవారి దీవెన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మెండుగా ఉండాలని తద్వారా మంచి పరిపాలన అందిస్తుందని అన్నారు.మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బహుళ జాతి పరిశ్రమలు మన రాస్త్రానికి తరలి వస్తున్నాయని త్వరలో వాటిని నెలకొల్పడం ద్వారా యువతి యువకులు లక్షల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి రాష్ట్రం ఆర్ధికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు.అపార అనుభవం దూరదృష్టి చిత్తశుద్ధి కల్గిన ఆర్ధిక నిపుణుడైన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాకతో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిలో ముందుకెళుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రెసిడెంట్ శ్రీనివాసు, పండితులు గ్రామ తెలుగుదేశం జనసేన బి జె పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.