Subscribe Us

header ads

ఇరవై సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూములకి పట్టా ఇప్పించాలని మంత్రికి వినతి


నూజివీడు /ఆగిరిపల్లి :ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చిన్నాగిరి పల్లి గ్రామ దళితులకు కేటాయించిన భూమి ఇరవై సంవత్సరాలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న సమయంలో కొంతమంది దళారులు ఈ భూమి తనదని దౌర్జన్యం చేయగా దానిపై న్యాయపోరాటం చేసి అనేక అర్జీలు పెట్టి ఆ భూమిపై రెవెన్యూ అధికారులు చే సర్వే చేయించుకుని ధర్మంగా కేటాయించిన భూమి దళితులకే చెందిందనిప్రభుత్వంనిర్ధారించింది.ఇదిలా ఉండగా ఆ భూమిపై కన్ను వేసిన కొంతమంది దళారులు మల్లా ఈ ఈ భూమి తమది అని పట్టా పుట్టించి తమపై దౌర్జన్యం చేస్తున్నట్లు దీనిపై నూజివీడు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి విచారణ జరిపించి తమ భూమికి శాశ్వత పట్టాన్ని ఇప్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం ఆగిరిపల్లి మండల శాఖ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సత్తు కోటేశ్వరరావు,జె.నాగేశ్వరరావు,జె.సురేష్ బాబు,జే.రామ్మోహనరావు,డి కుమారి,జే పాప,పి పాప,జై మహాలక్ష్మి డి వరలక్ష్మి,ఎం కుమారి,బి.పద్మ,కే.పుష్ప,జే.నాగేంద్రం,జె.నాగేశ్వరరావు,పాల్గొని వినతి పత్రాన్ని అందించారు.