మైలవరం : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు అందజేయటం, రాజధాని అమరావతి నిర్మాణం కోసం చర్యలు మొదలుపెట్టడంతో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పై మరింత విశ్వాసం,నమ్మకం పెరిగిందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
మైలవరం నియోజకవర్గంలోని అనంతవరం గ్రామంలో అనంతవరం మహిళ పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సంఘం నిర్మించిన నూతన పాల కేంద్రం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కలిసి పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తో కలిసి పాల కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే, ఎంపిలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు దివంగత మాజీముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కృషి వల్లే నేడు గ్రామాల్లో పాల సహకార సంఘాలు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటు బడ్జట్ లో వున్నా రైతులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండదండగా వుంటున్నారని చెప్పారు.
గత ప్రభుత్వం రాష్ట్రంలో అమూల్ లాంటి కార్పొరేట్ సంస్థలను తెచ్చి పాల సహకార సంఘాలను నాశనంచేయాలనిప్రయత్నించిందన్నారు.రైతులందరూ ఎన్ని కష్టాలు ఎదురైనా ఒక మాట మీద నిలబడి వున్నందకు అభినందనలు తెలిపారు. అలాగే రైతులకు ఏ కష్టం వచ్చినా అండదండగా వుంటూ సహకారం అందించిన కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ సి.హెచ్. ఆంజనేయులు కృషిని కొనియాడారు. రాజధాని అమరావతి తో పాటు మైలవరం అభివృద్ది కూడా జరుగుతుందని తెలిపారు.త్వరలో ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణనది హారతి కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే గొల్లపూడి దగ్గర వెస్ట్రన్ బైపాస్ పనులు ప్రారంభం కాబోతన్నాయన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి మైలవరం సమాగ్రాభివృద్ది కృషి చేస్తానని చెప్పారు.ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... నియోజకవర్గంలో తొలిసారిగా ఎంపి కేశినేని శివనాథ్ తో కలిసి పాల కేంద్ర భవనం ప్రారంభించటం సంతోషంగా వుందన్నారు.
ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలి.ప్రజాప్రతినిధులు మిగిలిన సమయంలో అభివృద్ది పై దృష్టి పెట్టాలి. గత ప్రభుత్వం ఈ విషమం మరిచిపోయి పాలన సాగిందన్నారు. జగన్ పాల సహకారం సంఘాలను నిర్వీర్యం చేయాలని చూశాడు అందుకే ప్రజలకు గద్దె దింపి బుద్ది చెప్పారన్నారు. అమూల్ సంస్థకు వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్థులు జగన్ కట్టబెట్టాడని తెలిపారు. ప్రజలంతా ఏకంగా వుంటే ప్రజాస్వామంలో ఏ వ్యవస్థను ఎవరు ఏమి చేయలేరని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో , గ్రామ సర్పంచ్ గూగులోతు కోటమ్మ ,మండల పార్టీ అధ్యక్షులు తాతా పోతురాజు రాష్ట్ర నాయకులు జంపాల సీతారామయ్య సీనియర్ నాయకులు బొందలపాటి సుధాకర్ , కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ సిహెచ్ ఆంజనేయులు , అనంతపురం పాలకేంద్ర సొసైటీ అధ్యక్షురాలు బొందలపాటి శైలజ , కృష్ణాజిల్లా యూనియన్ డైరెక్టర్ ఈశ్వర్ బాబు , కృష్ణ జిల్లా యూనియన్ పాలకవర్గ సభ్యులు ఉయ్యూరు అంజి రెడ్డి , చెరుకూరి ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు.