Subscribe Us

header ads

గోకవరం లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కార్యక్రమం


 జగ్గంపేట /గోకవరం :గోకవరం ప్రెస్ క్లబ్ భవనములో గోకవరం మండలం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నపు శాంతి బాబు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ముందుగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ మాండర్ డాగురే చిత్రపటానికి గోకవరం మండలం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బాలు,గంధం బుజ్జి,చీకట్ల రాజు,సతీష్ యూనియన్ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఇటీవల మృతి చెందిన యూనియన్ ట్రెజరర్ దుర్గ బాబు వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం వహించారు యూనియన్ గౌరవ అధ్యక్షులు గంధం బుజ్జి,మాట్లాడుతూ... ఫోటోగ్రాఫర్లు అంకిత భావంతో సృజనాత్మకంగా తీసిన ఒక ఫోటో కొన్ని పేజీల వార్తా సారాంశమును అర్థవంతంగా తెలియజేసి,పాఠకులను ఆలోచింప చేస్తుందని పేర్కొన్నారు ఫోటోగ్రాఫర్లు అంకితభావంతో కష్టపడతారని ప్రశంసించారు.

మనిషిని ఆలోచింప జేసే శక్తి ఫోటోలకు వుంటుందని అన్నారు.ఈ రోజున కెమెరా సృష్టితో ఫోటోగ్రాఫర్ల ఎన్నో కుటుంబాలు జీవన ఉపాధి పొందుతున్నామన్నారు. కెమెరా సృష్టికర్త డాగురే కి ఫోటోగ్రాఫర్లు రుణపడి ఉంటామని అన్నారు.
ఫోటోగ్రాఫర్ల సమస్యల పట్ల ప్రభుత్వం సంక్షేమం,అభివృద్ది కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు బాలుస్టూడియో (బాలు ) గంధం బుజ్జి,అధ్యక్షుడు శాంతి బాబు,స్టూడియో రాజ్,కొండపల్లి సతీష్,శివ, తేజ,బాబి,మైపాల సతీష్,అనిల్,రాంబాబు,చింటూ,బన్నీ,రత్నరాజు,వినయ్,సురేష్,సతీష్,రాఖీ,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.