బుట్టాయగూడెం:-
ఏలూరుజిల్లా బుట్టాయిగూడెం విద్యా రోహిణి స్కూల్ ఆవరణలో భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా.మమత మల్టీస్పెషల్టి హాస్పటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరాలను ప్రారంభించిన పోలవరం నియోజవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రపంచ నాయకుడు నిస్వార్థ కర్మయోగి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మీకు మంచి ఆరోగ్యం దీర్ఘాయువు అందించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని.. ఆయన దూర దృష్టితో కూడిన నాయకత్వంలో దేశం శాంతి శ్రేయస్సు తో ప్రపంచ కేంద్రంగా ఉద్భవించింది అని పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు తెలియజేశారు.
ఈ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కారాటం సాయి, కరాటం రెడ్డి బాబు, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల కిషోర్, బిజెపి జిల్లా కార్యదర్శి మాలతీ,బిజెపి జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్,పోలవరం బిజెపి ఇంచార్జ్ కొండేపాటి రామకృష్ణ, మండల అధ్యక్షులు మెట్ట బుచ్చిరాజు, అడపా నాగరాజు, సత్యనారాయణ రాజు, మరియు కూటమి మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.