అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు
అమరావతి రైతుల 1500 రోజుల ఉద్యమానికి సంఘీభావం తెలియజేసిన రంగన్నగూడెం జే.ఏ.సీ నేతలు
వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వికృత చేష్టలకు వ్యతిరేకంగా 1500 రోజులపాటు రైతులు,మహిళలు,దళితులతో సాగిన అమరావతి ఉద్యమం భవిష్యత్ తరాలకు ఆదర్శం అని అమరావతి పరిరక్షణ సమితి జే.ఏ.సీ నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు అన్నారు.
అమరావతి నే ఏకైక కి రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం నేటికి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా ఈరోజు వారు చేస్తున్న "అమరావతి సమర శంఖారావం" కార్యక్రమానికి సంఘీభావంగా ఈరోజు ఉదయం కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో స్థానిక అమరావతి పరిరక్షణ సమితి జే.ఏ.సీ ఆధ్వర్యంలో ప్రదర్శన,ధర్నా నిర్వహించి పూర్తి మద్దతు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు,అమరావతి పరిరక్షణ సమితి జే.ఏ.సీ నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ... జగన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించి అమరావతి రాజధానికి మరణశాసనం రాసి నేటికి 1500 రోజులు అని,రాష్ట్ర ప్రజలు ఏమైనా పర్వాలేదు మాకు మాత్రం రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనే విధముగా అమరావతి రెక్కలు విరిచారని అన్నారు.
అమరావతి చంద్రబాబు కలల రూపముగా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందటాన్ని భరించలేక రాష్ట్ర పురోగతిని సైతం బలి ఇచ్చారని అన్నారు.
చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళికతో ఏర్పాటు చేసిన అమరావతి,స్వయం ప్రాధారిత ప్రాజెక్టు అని ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పన, రోడ్లు,పార్కులు,పరిశ్రమలకు భూములు పొగా ప్రభుత్వం వద్ద పదివేల ఎకరాలు ఉండటం వల్ల రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చేది అని అన్నారు.
ఇప్పటికే రాజధాని ప్రాంతంలో విట్,ఎస్.ఆర్.ఎం,అమృతమయి యూనివర్సిటీలు,వ్యవసాయ విశ్వవిద్యాలయం,ఎయిమ్స్ హాస్పిటల్,హైకోర్టు,కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పూర్తయ్యాయని ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ,ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఏస్,తదితర ఉద్యోగుల గృహ సముదాయాలు 90 శాతం పూర్తయ్యాయని,సీడ్ యాక్సెస్ రోడ్డు తో పాటు 34 అంతర్గత రోడ్లు పూర్తయ్యాయని అన్నారు.
మూడు రాజధానుల ప్రకటన వల్ల ఇప్పటికే రెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని,130 సంస్థలు పక్క రాష్ట్రాలకు మరలిపోయాయని అన్నారు.
ఇప్పటికైనా అమరావతి రైతులు చేస్తున్న చారిత్రాత్మకు ఉద్యమాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రాజధాని రాజకీయ వికృత చేష్టలకు తెరదించింది అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎం.పీ.టీ.సీ సభ్యులు పుసులూరు లక్ష్మీనారాయణ,ఎం.పీ.సీ.ఎస్ అధ్యక్షుడు మొవ్వ శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ బెజవాడ వెంకటకృష్ణారావు,గ్రామ టి.డి.పి అధ్యక్షులు మొవ్వ వేణుగోపాల్, పి.ఎ.సి.ఎస్ మాజీ అధ్యక్షులు తుమ్మల దశరథ రామయ్య,స్థానిక అమరావతి పరిరక్షణ జే.ఏ.సీ నాయకులు కసుకుర్తి అర్జునరావు, పుసులూరు పూర్ణ వెంకట ప్రసాద్, కనకవల్లి శేషగిరిరావు, కొలుసు గంగాజలం,కోట మురళీకృష్ణ,కసుకుర్తి వేణుబాబు, కాట్రు రాంబాబు, కసుకుర్తి సత్యనారాయణ రావు,ఆలపాటి రవి కిషోర్,కొలుసు రంగారావు,కొలుసు సూరి బాబు, మరీదు వెంకట నాగేశ్వరావు, దేవరకొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.