Subscribe Us

header ads

భీమిలి లో ఎన్నికలు శంఖారావం పూరించిన జననేత జగనన్న


 భీమిలి మండలంలో సంగివలస గ్రామంలో జరిగిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి  ఎన్నికల శంఖారావం పూరించే క్రమంలో సమావేశం కి విచ్చేసిన జననేత కు భీమిలి నేత ముత్తంశెట్టి శ్రీనివాస్  పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలకడం జరిగింది.


 జగన్మోహన్ రెడ్డి అశేష ప్రజానీకం మద్యకు వెళ్ళి పార్టీ తొలినాళ్ళ నుంచి భుజాలపై మోస్తున్న నిస్వార్థ నా సైనికులు మీరే అంటూ అందరి దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి అభివాదం చేసారు.అనంతరం  జననేత ఎన్నికల వైసిపి క్యాడర్ సిద్దం కావాలంటూ శంఖారావం పూరించి డమరుకం మ్రోగించి రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీ గెలుపే లక్ష్యంగా బాధ్యత తో నాయకులు కార్యకర్తలు పని చేయాలని పిలుపు నిచ్చారు.


కార్యకర్తలు సమావేశం సభ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ...అసెంబ్లీలో ప్రజలు పక్షాన గళం విప్పాలని చూస్తే,చంద్ర బాబు నాయుడు బృందం నాకు మాకు ఇవ్వకుండా ఆపేసారని ఇక్కడైతే మీరు నన్ను అనగలరు ప్రజాక్షేత్రం, లో ప్రజలు వద్దకు వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటానని  పాదయాత్ర లో ప్రతీ ఒక్కరి సమస్యలు,విని నేను విన్నాను నేను ఉన్నాను అన్నారు.  చంద్ర బాబు లాగా భూటకపు హామీలు ఇవ్వకుండా నవరత్న పథకాలు గడప గడపకు కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా అవినీతి కి తావు లేకుండా గ్రామ సచివాలయంలో, వాలంటీర్లు ద్వారా గడప గడపకు సంక్షోభం పథకాలు అందేలా చేసామని అన్నారు.,అన్ని వర్గాలు తో పాటు నా యస్సి నా యస్టి నా బిసి నా మైనారిటీ అంటూ ప్రతీ బుడుగు బలహీన వర్గాల వారికి సంక్షోభం ద్వారా అలాగే  పదవుల్లో సముచిత స్థానం కల్పించడం చేసామని,మన వైసిపి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏ వాడకి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ప్రజలకు మనం చేసే మంచి నాడు నేడు ప్రభుత్వ పాఠశాలల మౌళిక సదుపాయాలు తో నిర్మాణం - రైతున్నలకు రైతు భరోసా కేంద్రాలు - గ్రామ సచివాలయాలు - ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - జగనన్న కోలనీలు ఇలా ప్రజలకు సేవలు అందించే ప్రతీ నిర్మాణాలు చేపట్టడం చేశామని.పేద పిల్దలు ఉన్నత విద్య కోసం  జగనన్న విద్యా దీవెన - జగనన్న వసతి దీవెన - ఫీజు రీయింబర్స్మెంట్ పథకం - అమ్మ ఒడి - పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందివ్వడం చేశామని.గతంలో ఒక పథకం అందాలంటే వృద్దులకు పెన్షన్ లు అందుకోవాలన్నా  ప్రభుత్వ అధికారులు కార్యాలయాలు చుట్టూ  కాళ్ళు అరిగేలా తిరిగే పరిస్దితి మార్చి ఉదయం 6 గం లకు గడప గడపకు వౄళ్ధి మన వాలంటీర్లు పెన్షలు అందించే నూతన పాలనకు శ్రీకారం చుట్టానని,మహిళా అక్కాచెల్లెళ్ళు కు డ్వాక్రా రుణమాఫీ - వైయస్సార్ ఆసరా - చేయూత అలాగే అన్ని కులాల మహిళలకు 45 సం నుంచి 60 సం లోపు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం చేసామని,అర్హత కలిగిన ఓ ఒక్కరు ఉండకూడదని ఈ మధ్య కాలంలో పలు కార్యక్రమాలు చేపట్టి జల్లెడ పట్టి సమస్యలు పరిష్కారం చేయడం చేసామని,ఉచిత వైద్యాన్ని గడప గడపకు అందేలా చేసామని,ప్రజలకు ఏమేమి చేయాలో అన్నీ ఈ నాలుగున్నర ఏళ్ళలో చేయడం చేసామని ఇంత చేసిన మనం వారికి ఏమి చేసామన్నది గడప గడపకు వెళ్ళి వారికి తెలియజేయాలని,అంతేకాక మళ్ళీ మీ బిడ్డ జగన్ మళ్ళీ వస్తేనే ఇవన్నీ మీకు గడప గడపకు లంచం లేకుండా నేరుగా మీకె అందుతాయని,లేదంటే టిడిపి ప్రభుత్వం పాలన లో మళ్ళీ మీరే లంచాలు ఇస్తూ నాయకులు జన్మభూమి కమిటీలు ప్రభుత్వ అధికారులు కార్యాలయాలు చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగే పరిస్దితి ఎదురవుతుందని,ప్రచారం చేసి రాబోయే ఎన్నికలకు సిద్ధం అంటూ బలమైన నినాదాన్ని వాడ వాడలా ప్రచురితం చేయాలని నాయకులు కార్యకర్తలు కు పిలుపునిచ్చారు.

అనంతరం నాయకులు కార్యకర్తలు మద్యకు వెళ్ళి వారికి అభివాదం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో నాయకులు కార్యకర్తల ఎన్నికల శంఖారావం సమావేశం లో ఉమ్మడి విశాఖ జిల్లా కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి  నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.