ఎలమర్రు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు 56వ రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నిక
(మంజీరగళం ప్రతినిధి )గుడివాడ :
56వ రాష్ట్రస్థాయి బాలికల మరియు బాలుర ఖో ఖో పోటీలు పోటీలు తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట నందు ఈనెల 24 25,26,వ తారీఖున జరుగు ఖోఖో పోటీలకు పెదపారపూడి మండలం ఎలమర్రు జడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి ఎనిమిదో తరగతి చదువుతున్న జి .అనిత ఎంపికైనట్లు పాఠశాల హెచ్.ఎం ఆర్ . వరుణ్ కుమార్ తెలిపారు .ఈ సందర్భంగా మండల వైస్ ఎంపీపీ వి.పద్మ ,సర్పంచ్ కె అనూష, ఎస్ ఎం సి చైర్మన్ ఇందిరా,వైస్ చైర్మన్ జి హరి ఓం ప్రసాద్ విద్యార్థినీ జి .అనిత మరియు పాఠశాల వ్యాయామఉపాధ్యాయులు పి ఎన్ సోమేశ్వరావు ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు వరుణ్ కుమార్ మాట్లాడుతు,విద్యార్థులలో చదువుతోపాటు క్రీడా నైపుణ్యం నేర్చుకుని ఉన్నత స్థానాన్ని ఎదగవలసింది గా ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులైన పద్మవతి, ఎం హెచ్ .బేగ్ ,ఎస్.కరుణ్ కుమార్ ,లక్ష్మీ కుమారి ఏ వి ఎస్ ఆచార్యులు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు