Subscribe Us

header ads

కృష్ణా జిల్లా వార్త వీరవల్లి రైల్వే ఆర్.ఓ.బి పనులు వెంటనే ప్రారంభించాలి:రాష్ట్ర రైతు సంఘాల నేతలు (మంజీరగళం ప్రతినిధి) ఆగిరిపల్లి కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరు పాడు గ్రామం లో విజయవాడ-విశాఖపట్నం సెక్షన్ లో ఎల్.సీ నెం.330 లెవెల్ క్రాసింగ్ స్థానంలో అండర్ పాస్ ను స్థానిక రైల్వే అధికారులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని ఉమా వరప్రసాద్,కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు,మాజీ జెడ్పీటీసీ సభ్యులు వేగిరెడ్డి పాపారావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు తదితరులు వీరవల్లి రైల్వే అర్.ఓ.బి పనులను వెంటనే ప్రంబించాలని,ఇతర సమస్యలు పరిష్కరించాలని,విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ కు రాసిన వినతి పత్రాన్ని దక్షిణ మధ్య రైల్వే ఏలూరు అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీరు పి. సంతోష్ కుమార్ కు పూర్తి వివరాలతో వినతి పత్రాన్ని సమర్పించారు.ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ ఇదే సెక్షన్ లో గతంలోనే కేంద్ర రైల్వే శాఖ వీరవల్లి రైల్వే గేటు స్థానంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి పనులను నిర్మాణానికి ఫీజుబిలుటీ ఇచ్చిందని,విజయవాడ-విశాఖపట్నం సెక్షన్ లో ఇటు నియోజకవర్గ కేంద్రమైన గన్నవరానికి అటు రెవెన్యూ డివిజన్ అయినటువంటి నూజివీడు కు అనుసంధానముగా ఉన్న ప్రస్తుత వీరవల్లి ఎల్.సి నెం.331 మాన్యువల్ గేటు అవతల ప్రక్కన మల్లవల్లి పారిశ్రామిక వాడ,మోహన్ స్పిన్ టెక్స్,ఎన్.ఎస్.ఎల్ తదితర భారీ పరిశ్రమలు ఉండటం వల్ల రద్దీ సమయాల్లో గేటు మూసినప్పుడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని,ఈ తీవ్ర పరిస్థితి దృష్ట్యా ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ కన్ స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరైన ఎల్.సీ. నెం.331 మాన్యువల్ గేట్ స్థానంలో ఆర్.ఓ.బి కి వెంటనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభించాలని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ కి విజ్ఞప్తి చేశారు.ఎల్.సీ. నెం.334 వేలేరు హరిజనవాడ వద్ద గ్రామస్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అండర్ పాస్ ను ఏర్పాటు చేయాలి అని, ఈరోజు ఎల్.సి నెం.330 స్థానం లో ప్రారంభించిన కోడూరుపాడు అండర్ పాస్ కు ఓవర్ హెడ్ రూఫ్,లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.




వీరవల్లి రైల్వే ఆర్.ఓ.బి పనులు వెంటనే ప్రారంభించాలి:రాష్ట్ర రైతు సంఘాల నేతలు



కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరు పాడు గ్రామం లో

విజయవాడ-విశాఖపట్నం సెక్షన్ లో  ఎల్.సీ నెం.330 లెవెల్ క్రాసింగ్ స్థానంలో అండర్ పాస్ ను స్థానిక రైల్వే అధికారులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని ఉమా వరప్రసాద్,కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు,మాజీ జెడ్పీటీసీ సభ్యులు వేగిరెడ్డి పాపారావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు తదితరులు వీరవల్లి రైల్వే అర్.ఓ.బి పనులను వెంటనే ప్రంబించాలని,ఇతర సమస్యలు పరిష్కరించాలని,విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ కు రాసిన వినతి పత్రాన్ని దక్షిణ మధ్య రైల్వే ఏలూరు అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీరు పి. సంతోష్ కుమార్ కు పూర్తి వివరాలతో వినతి పత్రాన్ని సమర్పించారు.ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ ఇదే సెక్షన్ లో గతంలోనే కేంద్ర రైల్వే శాఖ వీరవల్లి రైల్వే గేటు స్థానంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి పనులను నిర్మాణానికి ఫీజుబిలుటీ ఇచ్చిందని,విజయవాడ-విశాఖపట్నం సెక్షన్ లో ఇటు నియోజకవర్గ కేంద్రమైన గన్నవరానికి అటు రెవెన్యూ డివిజన్ అయినటువంటి నూజివీడు కు అనుసంధానముగా ఉన్న  ప్రస్తుత వీరవల్లి ఎల్.సి నెం.331 మాన్యువల్ గేటు అవతల ప్రక్కన మల్లవల్లి పారిశ్రామిక వాడ,మోహన్ స్పిన్ టెక్స్,ఎన్.ఎస్.ఎల్  తదితర భారీ పరిశ్రమలు ఉండటం వల్ల రద్దీ సమయాల్లో  గేటు మూసినప్పుడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని,ఈ తీవ్ర పరిస్థితి దృష్ట్యా  ఇప్పటికే  కేంద్ర రైల్వే శాఖ కన్ స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ద్వారా  మంజూరైన ఎల్.సీ. నెం.331 మాన్యువల్ గేట్ స్థానంలో ఆర్.ఓ.బి కి వెంటనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభించాలని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ కి విజ్ఞప్తి చేశారు.ఎల్.సీ. నెం.334 వేలేరు హరిజనవాడ వద్ద గ్రామస్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అండర్ పాస్ ను ఏర్పాటు చేయాలి అని, ఈరోజు  ఎల్.సి నెం.330 స్థానం లో ప్రారంభించిన కోడూరుపాడు అండర్ పాస్ కు ఓవర్ హెడ్ రూఫ్,లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.