జంగారెడ్డిగూడెం స్థానిక చత్రపతి శివాజీ డిగ్రీ కళాశాలలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు.
మంజీరగళం ప్రతినిధి:జంగారెడ్డిగూడెం.
స్థానిక చత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్ ప్రసాద్ బాబు అధ్యక్షతన కామర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ రంగంలో నూతన సంస్కరణలు అనే అంశంపై స్థానిక యూనియన్ బ్యాంక్ మేనేజర్ రష్మీ రంజన్ మరియు కౌన్సిలర్స్ ఎమ్ సుబ్బారామయ్య,జయరాజ్ కళాశాలలో బీకాం విద్యార్థులకు బ్యాంకింగ్ రంగంలో వచ్చిన కొత్త మార్పులు గురించి ఏ టి ఎమ్ కార్డులు ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇన్సూరెన్స్ ల వల్ల ఉపయోగాలు గురించి, పెన్షన్ స్కీమ్ ల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామర్స్ డిపార్ట్మెంట్ ఇన్చార్జ్ డా. కే. ఉత్తమ్ సాగర్ మాట్లాడుతూ బ్యాంకింగ్ సెక్టార్ లో అనేక రకాల సంస్కరణలు జరుగుతున్నాయని అవి వినియోగదారులందరూ సక్రమంగా వినియోగించుకుంటే మంచి ప్రయోజనాలు చేకూరుతాయని మనం పెట్టుబడి పెట్టేటప్పుడే మంచి రంగాన్ని ఎంచుకోవాలని వాటిలో ఒకటి బ్యాంకింగ్ రంగం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కామర్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు సిహెచ్ రమాదేవి కే వి వి శిరీష కళాశాల కామర్స్ విద్యార్థులు పాల్గొన్నారు