ఢిల్లీ రైతులకు మద్దతుగా కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో నిరస
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర అమలు చేయాలని ధర్నాలు నిర్వహిస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైతులపై పోలీసులతో లాటి చార్జి వారిపై కేసులు అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గాంధీభం సెంటర్ నందు రైతులకు మద్దతుగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడ్డల రాంబాబు సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి విస్సంపల్లి నాగరాజు మేకల జ్ఞాన రత్నం శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి పగుట్ల శాంత భూషణం తదితరులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం పై ఆందోళన కార్యక్రమం చేపట్టిన విషయం దేశ ప్రజలకు తెలిసినదే రైతులు తమ పండిస్తున్న పంటలకు మద్దతు ధర ఇవ్వాలని బిజెపి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం చేస్తుంటే రైతులకు ప్రధానమంత్రి మోడీ గిట్టుబాటు ధర ప్రకటించకపోగా రైతులను పోలీసుల ద్వారా లాటిఛార్జ్ చేస్తూ ఆ రైతులను చిత్రహింసలు చేస్తున్నందున స్థానిక మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు రానున్న ఎన్నికలలో దేశ ప్రజలు నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్తారని వారన్నారు ఈ కార్యక్రమంలో వేసపాం సత్యానందం జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు