అవంతి చేతులు మీదుగా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ అందజేత
ఆనందపురం మండలం శొంట్యాం పంచాయతీ కి చెందిన యంపిటిసి పల్ల రమణ (49 సం ) లివర్ సిర్రోసిస్ సమస్య తో బాధపడుతుండటంతో వైద్య ఖర్చులు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం చేయాలని శాశనసభ్యులు అవంతి శ్రీనివాసరావు ని కోరడంతో ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి కి సిఫార్స్ చేసి ఈరోజు 10 లక్షలు రూ చెక్కును పల్ల రమణ కుమారుడైన పల్ల దుర్గాప్రసాద్ కి అవంతి చేతులుమీదుగా అందివ్వడం జరిగిందసమస్య చెప్పిన వెంటనే సకాలం లో స్పందించి సహాయం అందేలా చేసిన అవంతి కి రమణ కుటుంబ సభ్యులు దన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో విశాఖ అగ్రి అడ్వైజరీ చైర్మన్ దాట్ల పెదబాబు వైస్ యంపిపి బోని బంగారు నాయుడు ఆనందపురం మండలం వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మజ్జి వెంకట్రావు - తర్లువాడ సర్పంచ్ బిఆర్బి నాయుడు వైస్ యంపిపి పాండ్రంగి శ్రీను లంక రాంబాబు ముసలి నాయుడు తదితరులు పాల్గొన్నారు