మానవసేవే మాధవసేవే లక్ష్యంగా: ఎన్.ఆర్.ఐ. కళాశాల విద్యార్థులు
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం గోపాలపురం గ్రామంలోని ఎన్.ఆర్.ఐ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిబ్రవరి 25 మరియు 26 ఎన్.ఎస్.ఎస్. స్పెషల్ క్యాంప్ 2023-24 భాగంగా సైబర్ క్రైంపై అవగాహనా మరియు నీటి పారుదల, నీటి వినియోగంపై కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులు అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారని కళాశాల ఛైర్మన్ డాక్టర్ ఆర్.వెంకట్రావుగారు తెలియజేసారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. నాగభాస్కర్ మాట్లాడుతూ మూడవరోజు నాలుగవ రోజు విద్యార్థులు నిర్వహించిన సైబర్ క్రైమ్స్ మరియు నీటి పారుదలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సేవాకర్యాక్రమాన్ని కనసానపల్లి గ్రామ సర్పంచ్ శ్రీ సంజీవయ్య మరియు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తంచేసారు.ఈ కార్యక్రమానికి సహకరించిన కళాశాల యాజమాన్యానికి,ప్రిన్సిపల్,ఎ.ఓ కి కనసానపల్లి గ్రామ సర్పంచి, ఎన్.యస్.యస్. కో-ఆర్డినేటర్ శ్రీ ఇ. శ్రీనివాస్, శ్రీ పి. వేణుగోపాల్ మరియు శ్రీ మహేష్ మరియు పి.ఓ. శ్రీ కాజా రాగసాయి, ఎన్.యస్.యస్. వాలెంటీర్లు పాల్గొన్నారు.