యోగాతోనే ఆరోగ్యం:డాక్టర్ రజిత
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలోని గరికపాటి సుబ్రహ్మణ్యం పిరమిడ్ జ్ఞాన మందిరంలో ప్రభుత్వపు హోమియో వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ డి రజిత తెలియపరిచారు.
రజిత మాట్లాడుతూ భారతీయ సంప్రదాయాల్లో యోగా అమూల్యమైదని అన్నారు. ప్రతి రోజూ యోగా పాటించడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎదుగుదలతోపాటు ప్రశాంతత లభిస్తుందని అన్నారు.పురుషుల యోగా శిక్షకుడిగా టీవీ కుమార్ వెంకట్రావు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శిక్షణ అందిస్తారు.స్త్రీలకు యోగా శిక్షణాధికారిగా శ్రీమతి ఎం జ్యోతి కుమారి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు శిక్షణ అందిస్తారని తెలిపారు.ఈ అవకాశాన్ని మండలంలో ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రణీత్ కుమార్,కుందా శీను,వేమూరి రాజేష్, పాల్గొన్నారు.