ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు
ఆగిరిపల్లి, మంజీరగళం ప్రతినిధి
ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండల పరిధిలో గల
మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల వట్టిగుడిపాడు నందు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఇంచార్జ్ హెచ్ఎం టి సుప్రియ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సర్ సివి రామన్ గారి ఫోటోకు ఘన నివాళి అర్పించి పాఠశాలలో విద్యార్థులు తయారుచేసిన వివిధ సైన్స్ పరికరాలు, ప్రయోగాలు, వర్కింగ్ మోడల్స్ ప్రదర్శించగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు తిలకించారు. అనంతరం పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం టి సుప్రియ మరియు ఉపాధ్యాయులు అంకం వెంకటేశ్వరావులు మాట్లాడుతూ సివి రామన్ గారు సైన్స్ లో సాధించిన విజయాలను, సైన్స్ కు ఆయన అందించిన సేవలను కొనియాడారు. విద్యార్థులు అందరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు తయారుచేసిన మోడల్స్ లో ఎలక్ట్రిక్ బోట్, కూలర్, నీటిని శుద్ధి చేసే మూడు కుండల విధానం మానవుని ఊపిరితిత్తుల వర్కింగ్ మోడల్ అమితంగా ఆకర్షించాయని ఇలాంటి ప్రయోగాలు విద్యార్థుల్లో జిజ్ఞాసను పెంపొందించి వారిలో సరికొత్త ఆవిష్కరణ రూపొందించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని కూరాటి జ్యోత్స్న దేవి, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.