Subscribe Us

header ads

భద్రాచలం అభివృద్ధికై చలో భద్రాచలం.

 భద్రాచలం అభివృద్ధికై చలో భద్రాచలం.


కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పై నిరసన దీక్ష.

( మంజీరగళం ప్రతినిధి )

 భద్రాచలం

 భద్రాచలం అభివృద్ధి కొరకై చలో భద్రాచలం కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భద్రాచలం అభివృద్ధిని విస్మరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంబేద్కర్ సెంటర్లో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ....కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముడుని పట్టించుకోవడంలేదని, బిజెపి పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి అయోధ్యలో ఉన్న రాముడే దేవుడా భద్రాద్రిలో ఉన్న రాముడు దేవుడు కాదా అని ప్రశ్నించారు. భద్రాద్రి రామాలయానికి భద్రాచలం పట్టణాన్ని అభివృద్ధికి పాటుపడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. భద్రాచలం రామ మందిరాన్ని తక్షణమే టెంపుల్ సిటీగా ప్రకటించాలని, 2000 కోట్లతో భద్రాచలం అభివృద్ధి చేయాలని, సెంట్రల్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని, ఎయిర్ పోర్టును  ఏర్పాటు చేయాలని, నాలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న భద్రాచలంలో తిరుపతిలో ఉన్న స్విమ్స్ మాదిరిగా ఇక్కడ కూడా ట్రైబల్ ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, ఉత్తరాది అయోధ్య రాముడే బిజెపి నాయకులకు దేవుడా? మా తెలంగాణ రాముడు దేవుడు కాదా? భద్రాద్రి దక్షిణ అయోధ్యగా పేరుగాంచినా భద్రాచల అభివృద్ధికి కేసీఆర్ ఒకసారి 100 కోట్లు అని మరొకసారి వెయ్యి కోట్లు ఇస్తానని కాలం వెళ్లబుచ్చారు అని అన్నారు. మా తెలంగాణ రాముడిని పట్టించుకోని బిజెపి నాయకులకు తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు.