జగ్గంపేట :స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు జాతీయ జెండా పెద్దాపురం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ లెక్కల నాయుడు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెద్దాపురం సబ్ డివిజన్లోని ఎమ్మెల్యేలకు ఎంపీలకు జాతీయ జెండా అందించి ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం,జీను మణిబాబు,అడబాల వెంకటేశ్వరరావు,పాండ్రంగి రాంబాబు,బస్వా చినబాబు, మెయిల్ ఓవర్సీర్ స్వామీజీ,సబ్ పోస్ట్ మాస్టర్ అజయ్,బిపిఎంలు పేపకాయల వీర్రాజు,పోస్ట్ ఉమెన్ అమ్మాణి,పోస్ట్ మాన్ బసవరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.