Subscribe Us

header ads

కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి శంకుస్థాపన!


 మంజీర గళం ప్రతినిధి) మొవ్వ:

పామర్రు నియోజకవర్గం: మొవ్వ మండలంలోని కూచిపూడి దుర్గా నగర్ నందు శ్రీ కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి గురువారం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. 25 నుంచి 30 లక్షల రూపాయలతో ఈ దేవాలయంకు గర్భాలయం, ముఖ మండపం, ప్రహరీ గోడ, పొంగల్ల గది, నిర్మించనున్నారు. ఈ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మద్దాల కామేశ్వరరావు, మద్దాల నాగభూషణరావు, కైలా రాంబాబు, చావా సోమేశ్వరరావు, ఎల్.ఐ.సి డెవలప్మెంట్ విశ్రాంత అధికారి మద్దాల వెంకటేశ్వరరావు, కైలా దుర్గారావు, లంకపల్లి సుధాకర్ రావు, మండల తెలుగుదేశం అధ్యక్షులు లింగమనేని రామలింగేశ్వరరావు, వీరంకి తులసీదాస్, గ్రామ సర్పంచ్ కొండవీటి వెంకటరమణ విజయలక్ష్మి అమర బాలేశ్వరావు దంపతులు, డాక్టర్ వడ్లాది విష్ణువర్ధనరావు, మరియు గ్రామస్తులు మొదలగువారు పాల్గొన్నారు.