Subscribe Us

header ads

రాష్ట్ర విద్యా విధానం కావాలి !మోడీ సర్కార్ నూతన జాతీయ విధానo రద్దు చేయాలి - ఏఐఎస్ఏ


 విజయవాడ :

ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) 

రెండు రోజుల సమావేశంలో నాయకుల డిమాండ్ ! 

దేశ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టకుండా, రాష్ట్రాలతో ఎలాంటి చర్చ లేకుడా మోడీ సర్కార్ 2020 కోవిడ్ సమయంలో తెచ్చిన “ నూతన జాతీయ విద్యా విధానం” స్థానంలో, ఆయా రాష్ట్రాల పరిస్తితులకు, స్తానిక భాష, చరిత్ర, సంస్క్రతులు, అవసరాలకు తగిన విధంగా ప్రతి రాష్టం తన స్వంత ప్రజా అనుకూల ప్రభుత్వ ప్రాయోజిత విద్యా విధానం తాయారు చేసుకొనే వీలు వుండాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) రాష్ట్ర అధ్యక్షుడు H.వేమన  డిమాండ్ చేసారు.  మోడీ మంత్రి వర్గం “ నూతన జాతీయ విద్యా విధానం” ను ఆమోదిoచగానే YS జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం మొదలు పెట్టిందని, దాని దుష్ఫలితాలను విద్యార్దుల తల్లి దండ్రులు అనుభవిస్తున్నారని ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన స్వంత విద్యా విధానాన్ని తీసుకురావాలి ఆయన కోరారు విద్యార్దుల సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ( ఏఐఎస్ఏ) రాష్ట్ర కార్యదర్శి A. నాగరాజు మాట్లాడుతూ, రాష్రంలో విద్యా సంవత్సరo మొదలై మూడు నెలలు కావస్తున్న ప్రభుత్వ పాఠశాలల  విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదని ప్రభుత్వం వెంటనే వాటిని అందజేయాలని ఆయన కోరారు. ఉపాధ్యక్షుడు V. అనిల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, BC, గిరిజన సంక్షేమ హస్టల్స్ కు గత 9 నుండి 14 నెలలుగా  నిధులు  కాలేదని, ఇది విదార్ద్యలకు అందవలసిన ఆహార నాణ్యతపై ప్రభావం చూపిస్తున్నదని అన్నారు. ఏప్రిల్, మే నెలలో ఎన్నికల కారణంగా హాస్టల్స్ మరమ్మతులపై ఎవరు దృషి పెట్టలేదని అనేక హాస్టల్స్ లో మౌలిక వసతులు సరిగ్గా లేవని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో ప్రతి వసతి గృహాలను తనిఖి  చేయించాలని ఇందుకు సాంఘిక సంక్షేమ శాఖ ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) రాష్ట్ర ఇన్ చార్జి, CPI ML లిబరేషన్ పార్టి కార్యవర్గ సభ్యడు ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, రాష్ట్ర విద్యా విధానం కావాలని, జాతీయ విధానoను తిర్క్సరించాలని కోరుతూ, విద్యార్దుల నుండి ఒక లక్ష సంతకాలతో సేకరిoచి   వినతి పత్రాన్ని ప్రభుత్వానికి ఇస్తామని, విద్యార్దులకు ప్రస్తుత కూటమి ఇచ్చిన హామీల అమలుకోరుతూ శీతాకాలం శాసన సభ సమావేశలకు విద్యార్దుల  "చలో అసెంబ్లి" నిర్వహిస్తామని ఆయన అన్నారు

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ(యం.యల్) పొలిటికల్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ వి.శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యార్దులను కేవలం లాభాలు సంపాదించి పెట్టే మరయంత్రాలుగా తయారు చేయడమే ఎన్.ఇ.పి లక్ష్యం అని లోన్ ఆధారిత విద్య అందించి, ఆ అప్పులు తీర్చడం లోనే విద్యార్దుల జీవితాలు తెల్లారిపోయే ప్రమాదాన్ని ఎన్.ఇ.పి తీసుకువస్తుందని తెలియచేశారు రాష్టంలోని వివిధ జిల్లాల నుండి 124 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.   ఈ కార్యక్రమంలో సిపిఐ(యం.యల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి బి.బంగార్రావ్, కార్యవర్గ సభ్యులు డి.హరినాద్, ఐసా రాష్ట్ర నాయకులు నాగార్జున, లవకుమార్, అఖిల్, మహేష్ తదితరులు పాల్గొని తమ సందేశాన్ని అందించారు.