Subscribe Us

header ads

జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన


మంజీర గళం ప్రతినిధి, ఆనందపురం: మండలంలోని గొట్టు పల్లి చందక గ్రామాల్లో నిర్మాతమవుతున్న గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఎం ఎం నరేంద్ర ప్రసాద్ గుత్తి దారులకు అధికారులకు దిశ నిర్దేశం చేశారు కట్టడానికి అవసరమైన ఇసుక సిమెంటు నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూస్తామని రానున్న నాలుగు మాసాలలో నిర్మాణాలు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ పర్యటించారు. గొట్టిపల్లి సర్వేనెంబర్ 20, 23 లోను సందక పంచాయతీ జగన్నాధపురం లో సర్వే నెంబరు నాలుగులోను వేసిన లేఔట్లను సందర్శించి పురోగతిని సమీక్షించారు అనంతరం ఆయన గృహ నిర్మాణ శాఖ అధికారులకు కాంట్రాక్టర్లకు దిశ నిర్దేశం చేశారు నాలుగు నెలలు మొత్తం పనులు పూర్తయ్యేలా అధికారులకు కాంట్రాక్టర్లకు చిత్తశుద్ధితో పని చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి డి. అఖిల గనుల శాఖ డిడి వివిఎస్ ఎన్ రాజు ఆనందపురం తాసిల్దార్ శ్యాం ప్రసాద్ ఎంపీడీవో ఎన్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు