Subscribe Us

header ads

చంద్రన్న కానుక కు అంబేద్కర్-పూలే(ఏపీ కానుక) కానుకగా నామకరణం చేయాలి.


 అమరావతి :రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు పండుగ సమయాలలో ఇచ్చే చంద్రన్న కానుక పథకం పేరును అంబేద్కర్-పూలే కానుకగా నామకరణం చేయాలని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి బాబు ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ లకు ఎక్స్ వేదికగా లేఖ రాశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ...రాష్ట్రంలోఅమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు దేశంలో మహనీయుల పేర్లు పెట్టడం ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయమని సురేష్ బాబు తెలిపారు. ప్రజలకు స్ఫూర్తినిచ్చే మహనీయుల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శనీయంగా ఉంటుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన ఎస్సీ,బీసీ సామాజిక వర్గాల ప్రజలు దైవాలుగా భావించే బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే ల పేరుతో ప్రజలకు పండుగ కానుకలు ఇచ్చే అంశాన్ని పరిశీలించారని సురేష్ బాబు కోరారు. అంబేద్కర్-పూలే కానుక(ఏపీ కానుక)గా నామకరణం చేస్తే ప్రజలలో స్ఫూర్తిదాయక పథకంగా చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.