ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం స్థానిక చత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్.ప్రసాద్ బాబు అధ్యక్షతన కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి సంబరాలను నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా కళాశాల విద్యార్థులు ఉట్టుకొట్టే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్.ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలలో మన కళాశాల విద్యార్థులు పాల్గొనడం వల్ల వారికి మన ఆచార సాంప్రదాయాల గురించి అవగాహన ఉంటుందని అందుకే కళాశాల ప్రాంగణంలో ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.ఎస్. తేజ బి.ఎస్.సి బి సి హెచ్ విద్యార్థి ప్రథమ బహుమతి సాధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.