Subscribe Us

header ads

విద్యుత్ సామాగ్రి దొంగల ముఠా అరెస్ట్.

(మంజీరగళం)ప్రతినిధి.జీలుగుమిల్లి

ఏలూరుజిల్లా జీలుగుమిల్లి సర్కిల్ ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని వ్యవసాయ క్షేత్రాలలో కలిగిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ధి.05.02.2024 వ తేదీ నాడు రాబడిన సమాచారం మేరకు బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 48/2024 అండర్ సెక్షన్ 379 ఐపీసీ కేసు నమోదు చేసిన దానిపై బుట్టాయిగూడెం ఎస్సై దుర్గ మహేశ్వరరావు కేసును దర్యాప్తును ప్రారంభించినారు

జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ యొక్క ఆదేశాలపై జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు యొక్క ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం ఎస్సై దుర్గా మహేశ్వర్ రావు మరియు వారి యొక్క సిబ్బంది సదరు కేసులో అనుమానితులను గురించి దర్యాప్తు ప్రారంభించగా బుట్టాయిగూడెం మండలం మర్ల గూడెం గ్రామ శివారులో ముగ్గురు వ్యక్తులు మోటర్ సైకిల్ పై అనుమానస్పదంగా వెళుచుండగా వారిని ఆపి తనిఖీలు నిర్వహించగా వారి వద్ద ఒక ప్లాస్టిక్ సంచలో 10 కేజీలు కాపర్ వైరు మరియు విద్యుత్ ట్రాన్స్ఫారములను పగలగొట్టుటకు ఉపయోగించి పనిముట్లను కలిగి ఉన్నట్లు అంతట వారిని విచారించగా వారిని జీలుగుమిల్లి మండలం జీలుగుమిల్లి గ్రామంలో కాపురం ఉంటున్నట్లు వారు ఎక్కువగా వ్యసనాలకు లోనై ఈజీగా మనీ సంపాదించాలని దృక్పథంతో వ్యవసాయ క్షేత్రాలలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలకొట్టి దానిలో ఉన్న కాపర్ వైర్లను అమ్ముకొని జలసాలు చేయడానికి అలవాటు పడినట్లుగా తెలియ చేసినారు 

సుమారు 40 కేసులలో విద్యుత్ వైర్ ను తొలగించి సదరు విద్యుత్ రాగి వైరును అశ్వరావుపేట లో గల తోట శ్రీనివాసరావు కి అమ్మినట్లు, తోట శ్రీనివాసరావు విజయవాడలో ఉన్న ఒక వ్యక్తి పదాతి సతీష్ అమ్మినట్లుగా తెలియచేసినారు. నిందితుల వద్ద నుండి సుమారు 400 కేజీల కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకున్నట్లు దాని యొక్క విలువ సుమారు రెండు లక్షల 40 వేల ఖరీదు చేసే కాపర్ వైర్ ను ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి స్వాధీనం పరుచుకున్న జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు ని బుట్టాయిగూడెం ఎస్సై దుర్గా మహేశ్వర్ రావు ని అభినందించిన జిల్లా ఎస్పీ.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వ్యవసాయ క్షేత్రాలలో గలిగినటువంటి ట్రాన్స్ఫర్ విద్యుత్ వైర్లను తొలగించడం వలన ప్రభుత్వానికి అపారమైన నష్టం కలుగుతుందని మరియు వ్యవసాయం చేసే వ్యవసాయదారులకు సుమారు రెండు మూడు నెలల పాటు వారికి కరెంటు లేక వారు వేసినటువంటి పైరులు పాడవుతున్న విషయంపై ప్రత్యేక దృష్టిని ఇటు పోలీసు వారు మరియు ప్రజలు కూడా జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా తెలియచేస్తున్నారు.