(మంజీరగళం ప్రతినిధి ): గోకవరం :
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఒక ముస్లిం బాలుడు శ్రీకృష్ణుని వేషధారణతో అందరిని ఆకట్టుకున్నాడు.మత సామరస్యానికి ప్రతీకగా ఈ సంఘటన చెప్పవచ్చు. గోకవరం గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ బాషా పోలీస్ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అతని భార్య సహిరతో కలిసి వారి కుమారుడు మీజన్ భాషాను చిన్ని కృష్ణునిగా ముస్తాబు చేసి మతసామరస్యాన్ని చాటుకున్నారు.ఒక ముస్లిం కుటుంబంలోని బాలుడిని చిన్ని కృష్ణునిగా ముస్తాబు చేయడం పట్ల పలువురు వారిని అభినందించారు.దేశ ప్రజలంతా కులమతాలకు అతీతంగా పండుగలను నిర్వహించుకుంటేనే మతసామరస్యం పెంపొందుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.