Subscribe Us

header ads

ఉచిత టెట్,డీఎస్సీ కోచింగ్ సెంటర్లోతెలుగు మెథడాలజీ,సోషల్ మెటీరియల్ పంపిణీ చేసిన జ్యోతుల లక్ష్మీదేవి,అనీష్ నెహ్రూ

(మంజీరగళం ప్రతినిధి ):జగ్గంపేట

స్థానిక గోకవరం రోడ్ లోని కాపు కళ్యాణ మండపంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఉచిత టెట్,డీఎస్సీ కోచింగ్ సెంటర్ లో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కోడలు నవీన్ సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి,వారి తనయుడు అనీష్ నెహ్రూ చేతుల మీదుగాతెలుగు మెథడాలజీ ,సోషల్ మెటీరియల్ అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ అందరి భవిష్యత్తు కోసం ఫౌండేషన్ ద్వారా మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో మీ అందరూ టీచర్లుగా ఉద్యోగాలు పొంది జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కి మంచి పేరు తీసుకురావాలని అన్నారు 22 రోజులుగా టెట్, డీఎస్సీ ఉచిత కోచింగ్ జరుగుతుందని 560 మంది ఈ కోచింగ్ సెంటర్ లో అడ్మిషన్ పొందగా ప్రతిరోజు 400 మందికి తప్పకుండా కోచింగ్ తీసుకుంటున్నారని మీ కుటుంబాలను పోషించేందుకు నూటికి నూరు శాతం టీచర్స్ గా ఉద్యోగం సాధించాలని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్నానని వీరందరూ టీచర్స్ గా ఉద్యోగాలు సాధించి జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విద్యార్థిలందరిని ఉద్దేశించి లక్ష్మీదేవి,అనీష్ నెహ్రూ అన్నారు.ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు,ప్రిన్సిపాల్ నీలం చక్రధర్,గద్దె మారుతి, సిహెచ్.ఉదయ భాస్కర్ చౌదరి,సురేష్,బాలాజీ,జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.