Subscribe Us

header ads

కురుపాం జడ్పీహెచ్ హై స్కూల్ లో వన మహోత్సవం .

పార్వతీపురం 

 పార్వతీపురం మన్యం జిల్లా,కురుపాం మండలం లో కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ , పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోట శంకర్రావు , తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని, పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. మండల విద్యా శాఖ అధికారి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై శ్రద్ధ వహించాలని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, పర్యావరణ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.