Subscribe Us

header ads

జి కొండూరు మండలం , మంజీరా గళం న్యూస్ ప్రతినిధి...


కొండూరు 
 రాష్ట్రంలో ప్రస్తుతం 26 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 2029 నాటికి 50 శాతానికి పెంచేందుకు మిషన్‌ హరితాంధ్రప్రదేశ్‌లో భాగంగా గ్రామ గ్రామాన వాడ వాడల విస్తృతంగా చెట్లు నాటే కార్యక్రమం ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు విధిగా కొనసాగించారు. అందులో భాగంగా జి.కొండూరు మండలం జి కొండూరు గ్రామంలో స్థానిక గ్రామ సచివాలయ...2 ప్రాంగణంలో స్పెషల్ ఆఫీసర్ జి మోహన్ బాబు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో కొన్ని మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ జి మోహన్ బాబు మాట్లాడుతూ పర్యావరణాన్ని సమతుల్యత పరిచే విధంగా మొక్కలు సహకరిస్తాయని వాటిని పెంచుకోవడం ప్రజల యొక్క కర్తవ్యమని ఆయన అన్నారు. అంతేకాకుండా విస్తృతంగా మొక్కలు నాటడానికి ప్రజలకు కావలసినటువంటి మొక్కలను ప్రభుత్వము నర్సరీలో తయారు చేసి అందిస్తుందని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగ పరుచుకొని హరితాంధ్రప్రదేశ్గా రూపాంతరం చెందే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. 
 ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జి మోహన్ బాబు. గ్రామ సర్పంచి మండల అరుణ ,ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, కొల్లి నాగేశ్వరరావు, ఉయ్యూరు వెంకట నరసింహారావు, పట్టా పంచల నరసింహారావు, తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు పజ్జురు రవికుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు పజ్జూరు వెంకటేశ్వరరావు, విజయవాడ పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు అంకెం ఇందిరా ప్రియదర్శిని, ఆంకెం సురేష్ , ఎన్టీఆర్, కందుల విశ్వకుమార్, బత్తిన శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ ,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.