కొండూరు
మండల కేంద్రమైన జీ కొండూరులో కొద్దిపాటి వర్షానికి ఎక్కడ రోడ్లు ఉన్నాయో ఎక్కడ గుంతలు ఉన్నాయో అర్థం కాని అయోమయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసిన రోడ్లన్నీ చెరువులుగా మారి వాహన చోదకులకు ప్రాణ సంకటంగా మారిపోతున్నాయి. పంచాయతీ గానీ ఇటు మండల డెవలప్మెంట్ అధికారులు కానీ కన్నెత్తి చూచిన పాపాన పోవడం లేదు. ఎంతోమంది ఆ గుంతలలో పడి ప్రాణాపాయ స్థితి దాకా వెళుతున్న పట్టించుకునే నాధుడే లేరు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా రహదారులకు కొద్దిపాటి మరమ్మతులు నిర్వహించి. రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాల్సినటువంటి సిబ్బంది నిమ్మకు నీరెత్తిన సంధాన వ్యవహరిస్తున్నారు. ఒకపక్క భారీ వాహనాలతో రోడ్లు మొత్తం గుంతలుగా మారిపోతుంటే చోద్యం చూస్తున్నారు తప్ప చర్యలు లేవు. గ్రామంలోకి భారీ వాహనాలు రాకూడదు అని గతంలో పలుమార్లు ఆంక్షలు విధించిన అవన్నీ గాలికి వదిలేసి వ్యవహరిస్తుంది నేడు పంచాయితీ. దానితో రహదారులు కూడా మొత్తం ట్రాఫిక్ తో నిండిపోతుంది ప్రయాణికులు వాహన చోధకులు మెయిన్ సెంటర్లలో అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది. ముఖ్యంగా పిల్లలు స్కూలుకు, ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్లే టైంలో ఈ రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది .ఉదయం, సాయంత్రం వేళలో ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని గుంతలు పూడిపించి, భారీ వాహనాలు గ్రామంలోకి రాకుండా ఆంక్షలు విధించి స్కూల్ పిల్లలకి ,ఉద్యోగస్తులకు గమ్యస్థానాలకు వెళ్లడానికి కావలసిన వాతావరణన్ని ఏర్పరచాలని ప్రజలు కోరుతున్నారు.