(మంజీరగళం ప్రతినిధి ):గోకవరం
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి ఎమ్మెల్యే నెహ్రూ గోకవరం మండలం భూపతిపాలెం గురుకుల పాఠశాల ఆవరణలో ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై మొక్కలు నాటి వనమహోత్సవం ప్రారంభించారు.ముందుగా పిల్లలందరితో నాయకులతో వనమహోత్సవం ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం గురుకుల పాఠశాలలోని తరగతి గదులు,హాస్టల్, వంటశాలలు,పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మంగా ఈరోజు వనమహోత్సవం హరితాంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా ఈ కార్యక్రమం తీసుకున్నారని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.ఈరోజు ఎక్కడ 150 కొబ్బరి మొక్కలు 50 రకాల వివిధ పళ్ళ మొక్కలు నాటడం జరుగుతుందని దీనిపై ఏపీవో శ్రద్ధ తీసుకుని ఐదు నెలల కాలం పరిరక్షించాలని కోరగా ఏపీవో అప్పలరాజు రెండు సంవత్సరాలు ఈ మొక్కల పరిరక్షణ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తీసుకుంటామని తెలియజేశారు.ప్రతి నాయకుడు, ప్రతి విద్యార్థి,ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అందులో భాగంగా తమ ఇంటి వద్ద ప్రతి ఒక్కరు ఈరోజు మొక్క నాటి తనకు ఫోటో పెట్టాలని కోరారు.గురుకుల పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు అంచులంచెలుగా ఏర్పాటు చేసుకుంటూ వెళ్తానని విద్యార్థులు అందరూ శ్రద్ధగా చదువుకుని మీ బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు,అడపా భరత్ బాబు,ఘాజింగం సత్తిబాబు, జడ్పిటిసి దాసరి రమేష్, దాసరి తమ్మన్న దొర,మంగ రౌతు రామకృష్ణ,స్కూల్ చైర్మన్ గల్లా రామచంద్రరావు, వైస్ చైర్మన్ రాజీవ్, సర్పంచులు అడపా వెంకట్రావు,విడుదల అర్జున్ రావు, కమ్మెలవెంకటేశ్వరరావు, దాసరి సీతారామకృష్ణ, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఎస్ఓ,ఏపీవో పిఎస్ అప్పలరాజు,గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్,గురుకుల పాఠశాల విద్యా కమిటీ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.