Subscribe Us

header ads

గరుగుబిల్లి ఎస్.ఐ.గా బాధ్యతలు స్వీకరించిన పి. రమేష్ నాయుడు


 మంజీర గళం (ప్రతినిధి) :

 పార్వతీపుర మన్యం జిల్లా,గరుగుబిల్లి మండలం లో ఎస్.ఐ గా శనివారం బాధ్యతలు స్వీకరించిన పి. రమేష్ నాయుడు. గతంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి లో ఇంటిలిజెన్స్ ఎస్.ఐ గా పనిచేస్తూ కొద్దిరోజులు కిందట జరిగిన ఎస్.ఐ. ల బదిలీల్లో భాగంగా రమేష్ నాయుడును గరుగుబిల్లి ఎస్.ఐ .గా నియమించిన జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో ప్రజా ప్రతినిధులు, మీడియా సోదరులు , ప్రజల సహకారముతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానన్నారు. అలాగే నాటు సారా, మద్యం, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఎస్.ఐ రమేష్ నాయుడు తెలిపారు.