మంజీర గళం ప్రతినిధి : రెడ్డీగూడెం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో దళితవాడలో ఉన్నటువంటి సమస్యలన్నీ గ్రామ సభ అధికారి సెక్రెటరీ రామారావు కి సమస్యలతో కూడిన వినతి పత్రం వసంత యువసేన నాయకులు టి ఎన్ టి యు సి మండల అధ్యక్షులు చాట్ల బాబురావు ఇవ్వడం జరిగింది.దళితవాడలో సమస్యలను వసంత యువ సేన నాయకులు మాతంగి రామారావు, చాట్ల అచ్చయ్య ఆధ్వర్యంలో గుర్తించమన్నారు.దళితవాడ లో సిసి రోడ్లు పోయవలసిన రోడ్లు సుమారు 890 మీటర్లు ఉందని వ్యక్తం చేశారు.సిసి రోడ్లతో పాటు పక్కా డ్రైన్లు నిర్మించాలని కోరారు. దళితవాడ స్మశానం లో జంగిల్ క్లియర్ చేయాలనీ, వానకాలం, ఎండాకాలం దళిత ప్రజలు నిలువ నీడ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.స్మశానం లో షెడ్ నిర్మించాలని, చిన్న వాటర్ ట్యాంక్ నిర్మించాలని అధికారులను కోరారు. పడమటి గూడెం కూలిన వంతెనను పునఃనిర్మించాలని కోరారు. జగ్గవరపు గట్టు దగ్గర ఇళ్ళ ప్లాటుల దగ్గర నుంచి కోటవారి చెరువు కు వెళ్లే కాలువ కట్ట రోడ్డుకు గ్రావెల్ తొలించాలని, పంట కాలువలు బాగుచేయాలని పూడిక తీత లు తీయాలన్నారు.మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ దళితవాడ సమస్య ల పై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కారం చెయ్యాలని కోరారు.
ఈ కార్యక్రమం లో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి మల్లాది నాగభూషణం పులిపాక అనంత కుమార్ పాల్గొన్నారు.