పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మా వలస మండలము
మంజీర గళం ప్రతినిధి :
జియ్యామ్మ వలస మండలము బట్లబద్ర గ్రామము లో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఒకే రోజు వ్యవధి లో తల్లీ కూతురు డెంగ్యూ జ్వరాలుతో 24 గంటలలో మృతిచెందడంతో కలకలం రేపింది. మెరువ.పరంధామ భార్య మేరువ.దుర్గమ్మ 40 సంవత్సరాలు మరియు కూతురు మేరువ. చైతన్య 20సంవత్సరాలు గత పదిహేను రోజులు గా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతూ చనిపోవడం గ్రామస్థులలో భయాందోళనలు నెలకొన్నాయి.ఈ గ్రామము లో గత 10 రోజుల కిందట అల్లు. వెంకట రమణ 55సంవత్సరాలు డెంగ్యూ తో చనిపోవడం జరిగింది. డెంగ్యూ జ్వరాలు నియంత్రణకు అధికారులు చేపడుతున్న చర్యలు ప్రకటనలకై పరిమితము అయ్యాయి అని ప్రజలు మండి పడుతున్నారు మన్యం జిల్లా కలెక్టర్ తగు చేర్యులు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు . ప్రజా ప్రతినిధులు అధికారులు మేలుకోవాలని కోరుతున్నారు