Subscribe Us

header ads

సుమారు 30 వేల రేషన్ డీలర్ల కుటుంబాలు రోడ్లు పడ్డాయి మమ్మల్ని ఆదుకోండి


 (మంజీర గళం ):ప్రతినిధి : జంగారెడ్డిగూడెం 

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం గత 5సంవత్సరాలు గా రేషన్ డీలర్లు ఆర్ధికంగా,చాలా నష్ట పోయా మని, సుమారు 30వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు దివి. లీలా మాధవరావు అన్నారు. ఈ రోజు స్థానిక లైన్స్ క్లబ్ లో డీలర్ల ఆత్మీయ సమావేశం డివిజన్ అధ్యక్షులు పి. అన్వర్ బాషా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమం లో డివిజన్ లోని 10మండలాల డీలర్ల తో పాటు చింతలపూడి, లింగ పాలెం మండలాల డీలర్స్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు మాట్లాడుతూ త్వరలో డీలర్లకు ముఖ్య మంత్రి చంద్రబాబు, డిప్యుటీ ముఖ్య మంత్రి పరిపాలనలో 1క్వింటా కు 150రూపాయలు , గౌ:వేతనం 5000రూపాయలు వచ్చేలా కృషి చేస్తున్నట్టు మాధవరావు చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లో మాకు మంచి జరగబోతుంది అని డీలర్లకు భరోసా ఇచ్చారు. బ్యాంకు కరెస్పాండంట్ లు గా నియమించాలని, ప్రభుత్వానికి సంబందించిన సంక్షేమ పథకాలు కొన్ని డీలర్ల ద్వారా అందించేలా చేస్తే ఆదాయం పెరుగుతుందని ఆయన అన్నారు.అనంతరం ముఖ్య మంత్రి చంద్రబాబు,ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్, పురందేశ్వరిఉన్న ఫోటోలకు పాలాభి షేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి వాసి రెడ్డి. నర్సింహా రావు, డివిజన్ అధ్యక్షులు. అన్వర్ బాషా ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో కంచెర్ల.రమేష్,చిన్నరాజు, గుళ్లపూడి.గుప్తా, సత్యనారాయణ, వర్మ, లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.