(మంజీరాగళం ). ప్రతినిధి :జంగారెడ్డిగూడెం
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. స్థానిక పాత బస్టాండ్ ఎం బి సోషల్ క్లబ్ ఆవరణలో జరిగిన రక్తదాన శిబిరం ను జనసేన పార్టీ నాయకులు, ఏజెన్సీ ప్రముఖులైన శ్రీ కరాటం రాంబాబు ప్రారంభించారు. గత 25 సంవత్సరాలుగా చిరంజీవి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న చిరంజీవి అభిమానులను అభినందించారు. బిగ్ టీవీ ,సాయిస్పూర్తి హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. మందులు పంపిణీనీ పట్టణ తెలుగుదేశంపార్టీ అద్యుక్షులు రావూరి కృష్ణ ప్రారంభించారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను చిర్రి బాలరాజు కట్ చేసి అభిమానులకు పంచారు. విలేకర్ల తో మాట్లాడుతూ చిరంజీవి అభిమానులందరికీ ఈరోజు (గురువారం) పెద్ద పండగ రోజు అని అభిమానులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటు తమ అభిమానాన్ని ఈ విధంగా చాటటం అభినందనీయం అని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు, బిజెపి పట్టణ అద్యుక్షులు కొప్పాక శ్రీనివాసరావు, చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు మద్దాల ప్రసాద్ , చింతల నాని, జంగారెడ్డిగూడెం అంబికా హొటల్స్ అధినేత మరియు జంగారెడ్డిగూడెం చిరంజీవి యువత అద్యుక్షులు ఉక్కుర్తి సీతారామ్,బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజర్ మరియు జనసేన పార్టీ 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, అచ్యుత శ్రీనివాసరావు, తిరుమల శెట్టి రవి, మల్లిపూడి రవి, షేక్ పీర్ ,శ్రీ ముప్పిడి శ్రీనివాసరావు, ఆకుల రాకేష్, షేక్ మస్తాన్, బుద్దాల నాగు, దెందుకూరు రాజి, కోసూరి కనకమహాలక్ష్మి, హసీనా, పగడం సౌభాగ్యవతి, దొండపాడు పుల్లారావు, రామారావు, మంగరాజు, వంశీ , పెదమల్ల బాలు అధిక సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొని చిరంజీవి ఇంకా ఎక్కువ సినిమాల్లో నటించి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లను చిర్రి బాలరాజు శాలువ కప్పి మెమెంటోల తో సత్కరించారు.