Subscribe Us

header ads

బట్టలబద్ర గ్రామాన్ని సందర్శించిన జనసేన నాయకులు.

 (మంజీరగళం) ప్రతినిది:కురుపాం నియోజకవర్గం

పార్వతీపురం మన్యం జిల్లాకు ,కురుపాం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు జియమ్మవలస మండలం, బట్లభద్ర గ్రామంలో డెంగ్యూ కారణంగా తల్లి,కూతురు చనిపోయిన విషయం తెలిసి బాధ్యతలను జనసేన నాయకుల పరామర్శించారు నాయకులు మాటల ఆడుతూ రోగాలు సీజన్ కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు వైరల్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు జిల్లా ప్రజలను వేధిస్తున్నాయన్నారు. ఇందులో ప్రమాదకరమైన డెంగ్యూ జ్వరం సోకి పలువురు మృత్యువాత పడటం బాధాకరమన్నారు. ప్రస్తుతం జిల్లాలోని జియ్యమ్మవలస మండలంలోని భట్లబద్ర, తుమ్మల బట్టివలస గ్రామాలలో డెంగ్యూ జ్వరాలు అధికంగా నమోదు అవుతున్నాయన్నారు. జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందకపోవటంతో ప్రైవేటు ఆసుపత్రులకు బాధితులు వెళ్తున్నారన్నారు. డెంగ్యూ జ్వరాల్లో నెలకొన్న ప్లేట్లెట్స్ తగ్గటం, ఆర్గాన్స్ డ్యామేజ్ తదితర లక్షణాలను చూసి బాధితులు భయపడి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఆసుపత్రికి వెళ్లి లక్షల రూపాయలు వదిలించుకుంటున్నారన్నారు. అయినా కొంతమంది ప్రాణాలు దక్కటం లేదన్నారు.

 డెంగ్యూ జ్వరానికి ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో పేద ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోందన్నారు. జిల్లా మంత్రి, పార్వతీపురం, కురుపాం, పాలకొండ, ఎమ్మెల్యేలు స్పందించి డెంగ్యూ జ్వరానికి సంబంధించిన చికిత్సను ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా కృషి చేయాలన్నారు. అలాగే జిల్లా ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందేలా స్థానిక ఎమ్మెల్యే తో మాట్లాడతారని తెలిపారు. ఆలాగే జిల్లా ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించి, యంత్రాలను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో డెంగ్యూ జ్వర పీడితులకు ప్లేట్లెట్స్ ఎక్కించే విధంగా పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలన్నారు. డెంగ్యూ జ్వరాలను నమోదు అవుతున్న గ్రామాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి, ఆయా గ్రామాల మిగతా ప్రజలను డెంగీ జ్వరం నుండి రక్షించాలన్నారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ, ఫ్రైడే కార్యక్రమాలతో పాటు దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహన కమిటీ కార్యదర్శి గౌరీ శంకర్, పెంట శంకర్రావు, ఐటి కోఆర్డినేటర్ ఎల్.రంజిత్ కుమార్ మండల నాయకులు రాజేష్,వెంకీ, భార్గవ్,రామకృష్ణ,సత్య, సత్యనారాయణ,సుధా, శశి, ప్రేము, శ్రీను ,వసంత్, రాజు ,మండల జనసేన నాయకులు,జనసైనికులు పాల్గొన్నారు.