( మంజీరగళం ప్రతినిధి ): జగ్గంపేట
జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులో గల కాపు కళ్యాణ మండపంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నిర్వహిస్తున్న టెట్,,+డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ కు సీనియర్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులుపత్సమట్ల సుబ్బరాజు విచ్చేసి డీఎస్సీ అభ్యర్థులకు ఈరోజు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ వివరిస్తూ బోధన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు.సుబ్బరాజు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మక జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ ఉచిత కోచింగ్ సెంటర్ బోధన ఇవ్వడానికి నన్ను ఎమ్మెల్యే పిలవడం వెంటనే వచ్చి ఈ మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉందని ఇంతటి మహాకార్యాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే గారిని సందర్భంగా అభినందిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు,గోకేడ రాంబాబు,ముసిరెడ్డి నాగేశ్వరరావు,ప్రిన్సిపాల్ నీలం చక్రధర్,బాలాజీ,పుర్రె సూరన్న,సురేషు,గద్దె మారుతి,తదితరులు పాల్గొన్నారు.