ఏలూరు
ఏలూరుజిల్లా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రూ 25,00,000/- చెక్కు అందచేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆపద సమయంలో విజయవాడ వాసులకు అండగా అందరూ నిలవాలన్నారు. తన వంతుగా 25 లక్షలు అందచేసినట్లు తెలిపారు. అందరు కూడా తోచిన సహాయం చేయాలనీ సూచించారు.
తదుపరి విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం కైకలూరు నియోజకవర్గం కలిడింది మండలం తాడినాడలోని శివాలయంలో స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ తో కలసి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక గ్రామ ప్రజలను కలిసి వరద పరిస్థితుల గురించి చర్చించారు. గ్రామస్తులు తమకు పంటు (పడవ) కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి మండల కూటమి ముఖ్యనాయకులతో కలిసి పాల్గొన్నారు.