ఆగిరిపల్లి:-
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలోవిజయవాడ వరద బాధితులకు మేమున్నామని సాయం చేసేందుకు ముందుకొచ్చారు.ట్రాక్టర్ ద్వారా నీట మునిగిన ప్రాంతాలను తిరుగుతూ ఆహార పొట్లాలను మంచినీరు ప్యాకెట్లను మందులను అందించారు.ఈ సందర్భంగా సంఘ ప్రెసిడెంట్ సగ్గుర్తి శీను మాట్లాడుతూ ఇలాంటి విపత్తు కలిగినప్పుడే ప్రజలందరూ ముందుకు రావాలని మానవసేవే మాధవ సేవగా భావించాలని కోరారు.ప్రతి ఒక్కళ్ళు తమకు తోచినంత సాయనందించాలని కోరగా రజకుల సంఘంలోని ప్రతి ఒక్కళ్ళు స్పందించి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని దీనికి సహకరించినటువంటి రజక సంఘం లోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.యువకుల సహాయంతో విజయవాడలోని ప్రతి ఒక్కరికి ఆహారం అందించగలిగామని ఇందుకు సహకరించిన యువకులకు కృతజ్ఞతలు తెలిపారు.